ఓ యూట్యూబర్ కారు ఢీకొనడంతో ఓ ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఝార్ఖండ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్‌లలో ఒకరైన మనోజ్ డే కారు ఇటీవల ఈ ప్రమాదానికి కారణం అయింది. తిస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జయరాంపూర్ కూడలి సమీపంలో అతడి టయోటా ఫార్చ్యూనర్ ఆటో-రిక్షాను ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మనోజ్ దే కారులో లేడు. మరో వ్యక్తి వాహనం నడుపుతున్నాడు.