TG: రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని ఆయన వెల్లడించారు. ఇక, ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని నాగరత్న చెప్పారు.