సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్?

63చూసినవారు
సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్?
రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సమావేశాలకు ఇబ్బందికరంగా మారడంతో 'లేక్ వ్యూ'ని వాడాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ గా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్