ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)గుడ్ న్యూస్ చెప్పింది. గోల్డన్జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరిట తీసుకొచ్చిన పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకం అందించనుంది. డిసెంబర్ 8 నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 22న ముగియనుంది. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ www.licindia.in ద్వారా ఆన్ లైన్ లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.