ప్రకృతిలో ఎన్నో దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంపై నేరుగా పిడుగు పడింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎయిర్‌పోర్ట్‌లో నిల్చున్న వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశాడు. బ్రెజిల్‌లోని సావో పాలో గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది జరిగింది. పిడుగు పడడంతో విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక 6 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.