లిక్కర్ స్కాం కేసు.. కవితకు నిరాశ

43924చూసినవారు
లిక్కర్ స్కాం కేసు.. కవితకు నిరాశ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై అత్యవసర విచారణ చేయాలని సీబీఐ స్పెషల్ కోర్టులో ఆమె లాయర్ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ప్రత్యేక జడ్జి మనోజ్ కుమార్.. ఈ కేసులో తక్షణం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని తెలిపారు. కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు. తన ఎదుట అత్యవసర తీర్పులపైనే వాదనలు జరుగుతాయన్నారు. రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని కవిత తరఫు లాయర్ కు జడ్జి సూచించారు.

సంబంధిత పోస్ట్