LIVE VIDEO: ఇంటి పైకప్పు కూలి వృద్ధుడు మృతి

78చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. హాజీ నఫీస్ (70) అనే వృద్ధుడు సాయంకాలంలో ఇంటి బయట వరండాలో కుర్చీ లో కూర్చున్నాడు. ఇంతలో ఒక్కసారిగా హాజీ నఫీస్ పై ఇంటి పైకప్పు కూలి మీద పడిపోయింది. గోడ కూలిన సమయంలో పక్కనే ఉన్నవారు ఆయనను పైకి లేపేందుకు ముందుకు వచ్చారు. అయితే అప్పటికే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్