జాతీయ పార్టీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

63చూసినవారు
జాతీయ పార్టీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల గుర్తును మరే ఇతర పార్టీ ఉపయోగించదు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో 2 సెట్ల ఓటర్ల జాబితాలను ఉచితంగా పొందవచ్చు. దూరదర్శన్ మరియు AIR వంటి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో ప్రసార స్లాట్‌లను పొందవచ్చు. స్టార్ క్యాంపెయినర్లను 40 మంది వరకు నామినేట్ చేయవచ్చు. వారి ఖర్చులు అభ్యర్థుల ఖర్చులుగా పరిగణించబడవు. జాతీయ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్