రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

613చూసినవారు
రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1పై బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బాసర మీదుగా వెళ్తున్న నర్సాపూర్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని నిషిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్లు తన ఐడి కార్డు ద్వారా తెలిసింది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలం చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్