కుంభమేళా అనేది ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా బుధవారంతో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు జరగనున్నాయి.