ఎస్సిలను ఏబీసీడీలుగా విభజించాలని జనవరి 19న హైదరాబాదులో జరిగే మాదిగల మహాగర్జన సభకు మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే స్కూటర్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆదివారం దేవరకద్ర మండలం బస్వాపురంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొబ్బలి అంజనేయులు ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ చేయకుండా జాప్యం చేయడానికి నిరసిస్తూ స్కూటర్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.