ప్రభుత్వం చేసిన అభివృద్ధి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కనపడటం లేదా అని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ ప్రశ్నించారు. బుధవారం కొత్తకోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ. మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ప్రగతి అని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఆల వెంకటేశ్వర్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు.