దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి రాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంతరం వారు మాట్లాడుతూ. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులో పొట్టి రాములు పాత్ర మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ఆర్యవైశ్యు సంఘం సభ్యులు పాల్గొన్నారు.