స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేసిన రైతులు (వీడియో)

84చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. కొయ్యూరు మండలంలోని రైతులు స్వయంగా తమ చేతులతో.. తాము సాగుచేస్తున్న గంజాయి పంటను నాశనం చేశారు. దీనికి గల కారణం.. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలే. గంజాయి వల్ల కలిగే అనర్థాలను తెలుసుకొని ఈ మేరకు ధ్వంసం చేశారు. సుమారుగా 15 ఎకరాల్లో పండించిన గంజాయిని రైతులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి తగలబెట్టారు. దీంతో పోలీసులు వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్