కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలోని ఎన్‌ఆర్‌పూర్ తాలూకాలో ఉన్న రంభపురి మఠానికి బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పాశెట్టి దంపతులు రోబోటిక్ ఏనుగును బహూకరించారు. దీనిని రంభపురి మఠం నిర్వాహకులు డాక్టర్ వీర సోమేశ్వర స్వామిజీ ఆదివారం ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పేరుకే రోబోటిక్ ఏనుగు అయినా ఇది చూడడానికి నిజమైన ఏనుగులా కనిపిస్తుంది.