దేవరకద్ర: డాక్టర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

81చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్