క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్. సి. సి యూనిట్ రాష్ట్ర స్థాయి శిక్షణ ఏర్పాటు కోసం నిధులు ఇస్తినని హామీ ఇచ్చారు.