గత 10 నెలల 25 రోజులలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం మాదేనని శనివారం మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్రం నాటి నుంచి దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంత రుణమాఫీ చేశారా.? ప్రధాని మోదీ, కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా. చర్చకు సిద్ధమా అంటూ సభలో రేవంత్ సవాల్ వేశారు. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల కోసం కుట్రలు చేస్తుందని, వాటిని తిప్పికొట్టాలని కార్యకర్తలను కోరారు.