దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రామనంతపూర్ గ్రామానికి చెందిన జె. బాలనాగన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ మేరకు హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని సంప్రదించగా రూ. 2. 50 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికుల నేతలు పాల్గొన్నారు.