మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలిదుపల్లి శివార్లలోని పత్రిగుంట చెరువు కట్ట తెగింది. దీంతో బలిజపల్లి- చిలుకటోనిపల్లి గ్రామాలకు శుక్రవారం రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.