కల్లుకు బానిసైన వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రమైన గద్వాలలో చోటుచేసుకుంది. రాఘవేంద్ర కాలనీకి చెందిన గృహిణి సుజాత (35) గత కొంతకాలంగా రోజు కల్లు సేవించనిదే ఉండలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆలస్యంగా కల్లు తీసుకురావడంతో కలత చెంది ఏకంగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.