జిల్లా కేంద్రమైన గద్వాలలో కోర్టు కొత్త భవనం నిర్మాణం కోసం న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం పార్టీ నాయకులు ర్యాలీగా కోర్టు భవనం వద్దకు చేరుకొని బార్ అసోసియేషన్ కు లేఖను అందజేశారు. కక్షిదారులను దృష్టిలో పెట్టుకొని కోర్టు భవనాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో న్యాయవాదులు చేపట్టిన ఆందోళన సరైనదేనని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.