జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం స్కూల్ విద్యార్థులు ఇంటికి చేరేందుకు బస్సుల సమస్య తలెత్తింది. మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సభ కారణంగా గద్వాల ప్రాంతానికి సంబంధించిన బస్సులను మహబూబ్‌నగర్‌కు తరలించడంతో స్థానికంగా బస్సుల కొరత ఏర్పడింది. వచ్చిన కొన్ని బస్సులు ప్రయాణికులకు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్‌ను కోరారు.