జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓ మున్సిపాలిటీ కార్మికుడు మానవత్వం ప్రదర్శించాడు. మధ్యాహ్నం వేళ దాహంతో నీటి కోసం అలమటిస్తున్న ఓ వానరంకు (కోతి) నీరు త్రాగించి మానవత్వం చాటుకున్నారు. నోరు లేని మూగ జీవానికి దాహం తీరుస్తున్న సన్నివేశాన్ని చూసి కార్మికునిపై పట్టణ వాసులు ప్రశంసలు కురిపించారు.