రామచందర్ రెడ్డి అంతిమ యాత్రలో ఎమ్మెల్యే

54చూసినవారు
రామచందర్ రెడ్డి అంతిమ యాత్రలో ఎమ్మెల్యే
గద్వాల మండలం పరిధిలోని అనంతపురం సమీపంలో దయ్యాల వాగు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటేల్ ప్రభాకర్ రెడ్డి తనయుడు పటేల్ రామచందర్ రెడ్డి మృతి చెందారు. వారి స్వగృహంలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో అంతిమ యాత్రలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని పాడెను మోసారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్