కర్రల కాళ్ల మీద కాలినడకన శ్రీశైలానికి

14935చూసినవారు
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాకు చెందిన శివభక్తుడు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కర్రల కాళ్లతో పాదయాత్ర చేస్తున్నాడు. బీజాపూర్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ తన కాళ్ల కింద రెండు కర్రలు కట్టుకొని కర్రల మీద కాలి నడకన శ్రీశైలం వెళ్తున్నాడు. తమ కుటుంబ పెద్దల మొక్కుబడిలో భాగంగా ప్రతి ఏటా పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చేరుకున్న ఆయనను పలువురు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్