మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో మంగళవారం కూరగాయల మార్కెట్ కు ఎదురుగా రోడ్డు పక్కన సుమారు 40-45 ఏళ్ల మధ్య వయసుగల గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకునిన సీఐ కమలాకర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుర్తిస్తే జడ్చర్ల పోలీస్ స్టేషన్, 8712659314, 8712659343 సంప్రదించాలని సీఐ సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.