రేపు డీకే అరుణ నామినేషన్.. హాజరుకానున్న కేంద్రమంత్రి

561చూసినవారు
రేపు డీకే అరుణ నామినేషన్.. హాజరుకానున్న కేంద్రమంత్రి
మహబూబ్ నగర్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉ. 9: 00 గం. కు కేంద్ర మంత్రితో కలిసి డీకే అరుణ పిల్లల మర్రిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, అక్కడి భారీ ర్యాలీతో నామినేషన్ వెయ్యనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్