పేదలు ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరైయింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనేనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు ఎప్పుడూ మేలు చేయలేదని ఒక్క ఇల్లు, రేషన్ కార్డులను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. బుధవారం గ్రామ సభల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వచ్చాయని అన్నారు.