మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన భారతమ్మ(60) అనే మహిళా శనివారం అనారోగ్యంతో మరణించింది. ఈ సందర్భంగా ఆమె మృతికి బీఆర్ఎస్ యువనేత, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి సంతాపం తెలిపారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ. 5 వేల రూపాయలను అందజేశారు.