జనవరి 26 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు మంగళవారం నుంచి జనవరి 24 వరకు షెడ్యూల్ ప్రకారంగా గ్రామసభల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.