జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో బుధవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ. మిడ్జిల్ మండలంలోని రెడ్డి గూడా, చిల్వేర్, అయ్యవారిపల్లి, వెలుగోముల, కొత్తూరు గ్రామాలకు డబుల్ రోడ్డు అవసరం లేదని, కేవలం ఇసుక తరలించడానికి స్థానిక శాసనసభ్యుడు రోడ్లు వేస్తున్నారని, ఇసుక తరలించడంతో బోర్లు ఎండిపోయి రైతులు నష్టపోతారని తెలిపారు.