జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ చేన్నకేశవ స్వామిని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయ దశమి సందర్భంగా ప్రజలందరికీ సకల సంపదలు వృద్ధి చెందాలని, పాడి పంటలతో సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను అని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. జడ్చర్ల నియెజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.