ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలో చదివే విద్యార్థుల చదువు ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని శనివారం కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.