జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని కల్లెపల్లిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధాన ఉత్సవంలో మంగళవారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. యువత చెడువ్యసనాలకు లోనవకుండా మంచిదారిలో పయనించాలని కోరారు. కుటుంబానికి, నియోజకవర్గానికి మంచిపేరు తేవాలన్నారు.