భూత్పూర్: 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

79చూసినవారు
భూత్పూర్: 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం
భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో నారాయణ భార్య సునీత సోరేన్ కు గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్ కు కాల్ చేయగా వెంటనే చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను అంబులెన్స్ లోకి తీసుకొని హాస్పిటల్ కి వెళుతుండగా మార్గ మధ్యలో నొప్పులు అధికమవడంతో ఎనగొండ సమీపంలో అంబులెన్స్ లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వారిని హాస్పిటల్ లో అడ్మిట్ చేశామని 108 సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్