నవాబ్ పేట: ఇంటి వద్దే ప్రసవం చేసిన 108 సిబ్బంది

63చూసినవారు
నవాబ్ పేట: ఇంటి వద్దే ప్రసవం చేసిన 108 సిబ్బంది
నవాబ్ పేట మండలం హనుమసానిపల్లె గ్రామానికి చెందిన శివశంకర్ భార్య మానస కు పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకున్న తర్వాత మానస కు ప్రసవ వేదన ఎక్కువ అవడంతో, ఈఎంటి మెహబూబ్ భాష, పైలట్ శివశంకర్ ఆమెకు ఇంటివద్ద సాధారణ కాన్పు చేయగా పండంటి ఆడ బిడ్డ శుక్రవారం జన్మించింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్