ఆత్మకూరు మండలం బాలకిష్టపూర్ గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆంజనేయస్వామి వారి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ధ్వజస్థంభ స్థాపన కార్యక్రమం పూర్తి చేసిన సందర్భంగా నేడు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.