వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై అశోక్ బాబు అన్నారు బుధవారం మాగనూరు మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్పి యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు.