మక్తల్ పట్టణంలోని యాదవ నగర్ లో వెలసిన వీరభద్రస్వామి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు మంగళవారం ప్రభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.