మక్తల్: బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు: శ్రీహరి

72చూసినవారు
మక్తల్: బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు: శ్రీహరి
మక్తల్ పట్టణంలో వెలసిన సుప్రసిద్ధ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులను, వైద్య సిబ్బందిని, ఆలయ కమిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్