మక్తల్ పట్టణం బసవేశ్వర కాలనీకి చెందిన సత్యారెడ్డి(32) పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన సత్యారెడ్డి గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.