హైద్రాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో బుధవారం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలు, సభలో ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాలపై శిక్షణా తరగతులు ఇవ్వనున్నారు.