నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇతర పథకాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నారు.