బిజినేపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ లో నీటి తోడివేత పూర్తయిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. గురువారం వట్టెం పంపు హౌజ్ ను పరిశీలించారు. వరద జలాలు రావడం వల్ల రెండు వారాల క్రితం వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది అన్నారు. సీఎం, మంత్రుల సహకారంతో ఇంజనీర్లు వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే పంప్ హౌస్ లో 30ఫీట్లకుపైగా నీటిని తొలగించడం జరిగిందన్నారు.