ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ ఎర్రజెండా అని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాగర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా సీపీఎం మూడో జిల్లా మహా సభలలో భాగంగా రెండోరోజు ప్రతినిధుల సభను అచ్చంపేటలో నిర్వహించారు. జిల్లాకు నల్లమల అడవులు ఆనుకొని ఉన్నందున ప్రభుత్వం కాగితపు పరిశ్రమ నెలకొల్పి గిరిజన, దళితులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దేశంలో ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ ఎర్రజెండా ఉంటుందన్నారు.