అన్ని అర్హతలు ఉన్న కోటకొండ ను మండల కేంద్రంగా ప్రకటించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఎన్నికల్లో గెలిస్తే కోటకొండను మండల కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.