నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండా మండలం బండోనిపల్లికి చెందిన ఆకుల నరేష్(25) సరూర్నగర్ లో మేస్త్రి పని చేసేవాడు. ఇదే క్రమంలో నగరానికి చెందిన 16 ఏళ్ళ బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేష్ ను కోర్ట్ లో హాజరు పరచగా గురువారం పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ళ శిక్ష, జరిమానా విధించింది.