నాగర్ కర్నూల్ జిల్లాలో కారు బైక్ ను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బుధవారం శ్రీను (38), శేఖర్ (36)లు తెలకపల్లి మండలం అనంతసాగర్ గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తాడూరు మండలం గుంత కోడూర్ గ్రామ సమీపంలో బైక్ పై శ్రీను, శేఖర్ లు ఆర్టిసీ బస్సును ఓవర్ టెక్ చేసి వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించారు.