సరిగా పని చేయని అధికారులను ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ అనసూయ అధ్యక్షతన నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇకపై వారానికి ఒకసారి సమీక్ష చేస్తానని అన్నారు. రోడ్డు మధ్యలో డివైడర్లపై వున్న కానో కార్పస్ చెట్లు తీసివేయాలని చెప్పిన ఎందుకు తొలగించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.